జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్
నవతెలంగాణ – నెల్లికుదురు : ఈ వర్షాకాల సీజన్ లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారుడు రవి రాథోడ్ అన్నాడు. మండల కేంద్రంలోని స్థానిక వైద్యశాలను సందర్శించి ఆకస్మికతనికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చే జబ్బులు ఎలా ప్రజలకు వస్తాయి వాటిని ఎలా అధిగమించాలి అని వివరంగా ప్రజలకు అర్థమైంది అని చెప్పి అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా వైద్య సిబ్బంది నిర్ణయాలు తీసుకొని టీమ్ గా వీధిగా ఏర్పడి గ్రామాలలో సందర్శించాలని అన్నారు.
ఇప్పటివరకు ప్రజలకు ఏమైనా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా జ్వరాలు వచ్చాయా ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో క్యాంప్ అవసరమైతే ఏర్పాటు చేయాలని తెలిపారు. టీవీ క్యాంపును పరిశీలించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి వైద్య సిబ్బందిని విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి శారద హెల్త్ అసిస్టెంట్ వీరన్న తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES