నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామంలో గ్రామ పరిసరాల్లో ఎక్కడ చెత్త వేయకుండా, శుభ్రత వాతావరణం నెలకొన్న చూడాలని జిల్లా కలెక్టర్ మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చిన్న మల్లారెడ్డి కార్యదర్శినీ, కామారెడ్డి మండల ఎంపీడీవోను ఆదేశించారు. రాజంపేట మండలం ఆరుగొండలో మంగళవారం ఒ కార్యక్రమానికి హాజరై తిరిగి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వస్తుండగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెత్త కనపడంతో తన వాహనం ఆపి చెత్తను పరిశీలించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ చెత్తను వేస్తున్నారని దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను పరిసరాలను అపరిశుభ్రం చేసే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని మండల్ ఎంపీడీవో ని, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ఆపరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES