మారుమూల గ్రామాలకు టీఎక్స్ ఆస్పత్రి విస్తరించాలి
ప్రముఖ నటుడు మాజీ మంత్రి బాబుమోహన్, ప్రముఖ నటి సంయుక్తమీనన్, నటుడు అఖిల్ ఉద్దేమారి
మియాపూర్‌లో టీఎక్స్ హాస్పిటల్స్ 5వ బ్రాంచ్ ప్రారంభం
నవతెలంగాణ- హైదరాబాద్
టీఎక్స్ హాస్పిటల్స్ మియాపూర్‌లో తన 5వ బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించి మరో మైలురాయిని సాధించింది. నైతికత, నాణ్యత, ఆధునిక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టింది. గురువారం ఈ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ , ప్రముఖ నటి సంయుక్త మెనన్, నటుడు అఖిల్ ఉద్దేమారి హాజరై రిబ్బన్ కట్ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి వైద్యులు, ఆహ్వానిత అతిథులు, గౌరవనీయులు హాజరయ్యారు. మియాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ మల్టీ-స్పెషాలిటీ సెంటర్ ఆధునిక వసతులు, అధునాతన నిర్ధారణ పరికరాలు, సిస్టమేటిక్ క్లినికల్ ప్రోటోకాల్స్‌తో రూపుదిద్దుకుంది.
ముఖ్య స్పెషాలిటీల్లో ఈ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ శస్త్రచికిత్స సేవలు అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్భంగా చైర్మెన్ డా. కీర్తికర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా. దీపక్ రాజు,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ రెడ్డి రవీందర్ రెడ్డి సీఓఓ డా. శ్రీకాంత్ వొడ్నాల సంస్థ యొక్క నాణ్యత ఆధారిత, పేషెంట్-సెంట్రిక్ వైద్య సేవల పట్ల తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. అలాగే సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు పాండురంగారెడ్డి, నవ్య వాణి, డా. రవి కిరణ్, జనార్ధన్ ఈ కొత్త బ్రాంచ్ మియాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను మరింత చేరువ చేస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఎక్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



