నేరలను నేరలను నియంత్రయించేందుకే కార్డెన్ సార్చ్ ..
బైంసా రూరల్ సిఐ నైలు..
నవతెలంగాణ – కుభీర్
గ్రామాల్లో సైబర్ నేరల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడలని బైంసా రూరల్ సిఐ నైలు అన్నారు. గురువారం మండలంలోని నిగ్వ గ్రామంలో ఉదయం ఐదు గంటల సమయంలో పోలీస్ బలగలతో ముడు బృందలుగా విడిపోయి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ఇంటికి సోదలు నిర్వహించి గ్రామమలో సరైన పత్రాలు లేని 120 ద్విచక్రా వాహనాలు 4 ఆటో లను సిజ్ చేసినట్లు సి ఐ నైలు తెలిపారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సి ఐ నైలు మాట్లాడుతూ గ్రామమలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
అదే విదంగాగ్రామమలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లు తెలిస్తే వెంటనే పోలిసులకు సమాచారం అందించాలని అన్నారు. సైబర్ నేరల వల్ల ప్రజలకు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఎవరైనా గుర్తు తెలియని ఫోన్ నెంబర్ ల ద్వారా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే 1930టోల్ ప్రీ నెంబర్ కి కాల్ చేయాలన్నారు. రోడ్డు పై వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్డెన్ సర్చ్ లో కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి , కుంటలు ఎస్ ఐ, బైంసా ఎస్ ఐ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
సైబర్ నేరల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES