Saturday, November 1, 2025
E-PAPER
Homeజిల్లాలుసీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డా.శివకాంత్  

సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డా.శివకాంత్  

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
సీజన్లో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శివకాంత్ సూచించారు. శుక్రవారం మండలంలోని వాడ్యాల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టిబి, షుగర్, బిపి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 30 మందికి తెముడా శాంపిల్స్ సేకరించినట్లు, ఎక్స్రే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

 ఈ క్రమంలో 74 మందికి వైద్య పరీక్షలు  నిర్వహించగా.. జ్వరము ,దగ్గు, కడుపులో నొప్పి, బాడీపెయిన్స్ , రక్తహీనత ,తలనొప్పి , వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆయూమ్ ఖాన్ , పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు ,సూపర్వైజర్ సునంద, హెల్త్ స్టెంట్లు దేవయ్య, జంగయ్య ,సంపత్ కుమార్, జిల్లా  టీం యాసీన్, రాజు, ఏఎన్ఎంలు నీలమ్మ, పద్మజ, చంద్రకళ, తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు నర్మదా,ఎల్లమ్మ, యాదమ్మ, లక్ష్మమ్మ ,సుజాత,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -