Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే షిండే

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సందేశం తెలియజేస్తూ రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు,తీగలకు దూరంగా ఉండాలని తెలిపారు. వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు,విద్యుత్ తీగలు,ఇనుప స్తంభాలు తాకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని  చెప్పారు.

ముఖ్యంగా పిల్లలు,వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలి, రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి వెల్లడించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు వెళ్లకండని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో ఉండే ప్రజలుసూ జాగ్రత్తలు తీసుకోవాలి వెల్లడించారు. డ్రైనేజీ కాలువలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్ళకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -