పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు..
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నర్మాల మానేరు వాగులో గల్లంతయిన నాగయ్య ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నర్మాల వద్ద మానేరు వాగులో గల్లంతయిన నాగయ్యను ఆచూకీ కనుక్కునేందుకు రెస్క్యూ చర్యలు ముమ్మరం చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. వరదలో చిక్కుకున్న మిగతా వారిని ఒడ్డుకు చేర్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES