Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అనిల్ రెడ్డి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అనిల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో సంక్రాంతి సెలవుల సమయంలో మాంజా ధారల వాడకం వల్ల ప్రాణపాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ మాంజ దారాలను వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. మాంజా దారాలు ద్విచక్ర వాహనదారులు, పాదాచారులకు ప్రమాదకరంగా మారుతున్నాయని, ముఖ్యంగా రోడ్లపై గాలిపటాలు ఎగిరేయకుండా తల్లిదండ్రులు పిల్లలను నియంత్రించాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు ముందుస్తూ అవగాహన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చైనా మాంజ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ అనిల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -