ఊరికి వెళ్లేటప్పుడు పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలి
ప్రతి వీధికి, ఇంటికి సీసీ కెమెరాలు తప్పనిసరి
దొంగతనాలను నియంత్రించేందుకు పోలీసులు నిరంతర తనిఖీలు
పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తించాలని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి ప్రజలకు సూచించారు. సోమవారం సిఐ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ దసరా సెలవుల సందర్భంగా దసరా పండుగకి ఊరికి వెళ్లే ప్రజలు ఇల్లును భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. పక్కింటి వారికి ఊరికి వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేస్తారని సూచించారు. దొంగతనాలను నియంత్రించేందుకు ప్రజల సహకారంతో పోలీసులు నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు ఆభరణాలను, డబ్బులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. పక్కింటి వారికి, తెలిసినవారికి ఇచ్చి మోసపోకూడదని తెలిపారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్ తో తాళం వేయడం మంచిదన్నారు. సోషల్ మీడియాలో లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారో సమాచారాన్ని పెట్టకూడదని తెలిపారు.
దొంగతనాలను నివారించేందుకు ఇంటితోపాటు ఇంటి ఆవరణలో, వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా చూసుకోవచ్చని తెలిపారు. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టన్ ను వేయాలని, ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించి దొంగతనాలను నివారించాలని తెలిపారు. వీధులలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని,100 కు డయల్ చేయాలని సూచించారు.
దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES