– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
– నాగపూర్ లో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో చేపట్టిన ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, రోజుల తరబడి నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పనికి రాని టైర్లు, బకెట్లలో, ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలన్నారు.రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిపారు.ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిల్వ ఉంచుకొని గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి మహేందర్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఏఎన్ఎం అరుణకుమారి, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES