కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్..
నవతెలంగాణ – కాటారం
అనుమతులు లేని, చట్ట విరుద్ధమైన లక్కీడ్రాల పేరుతో కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ప్రజలను మభ్యపెడుతున్నారని, లక్కీ డ్రా లకు ఆకర్షితులై ప్రజలు ఎవరు మోసపోవద్దని కాటారం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. కాటారం మండలం లోని సామాజిక మాధ్యమాల్లో లక్కీ డ్రా కూపన్లు దర్శనమిస్తున్నాయని వాటికి ఆకర్షితులై ప్రజలు డబ్బులు చెల్లించి మోసపోవద్దని అన్నారు. తాజాగా కాలేశ్వరం లో లక్కీ డ్రా నిర్వహిస్తున్న ఎస్ ఆర్ ఆర్ లాడ్జి నిర్వాహకుడు సంతోషం శ్రీనివాస్ రెడ్డి పై కాలేశ్వరం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అనుమతులు లేకుండా లక్కీ డ్రా లు నిర్వహించి ప్రజలను మోసం చేయాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని లక్కీ డ్రాలను ఎవరైనా నిర్వహించాలని చూసిన వారి సమాచారం తెలియజేస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
లక్కీ డ్రా పేరుతో ప్రజలు మోసపోవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



