Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

- Advertisement -

ఆనగంటి వెంకటేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తం
నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పరిపాలనలో గ్రామాలు అస్తవ్యాస్తంగా మరినాయని, గ్రామాల్లో కనీస వసతులు లేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. మంగళవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పస్రా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో స్థానిక సమస్యలపై సర్వే చేయడం జరిగింది. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు లేక గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, దీనితో సమస్యలతో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు.

ములుగు జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న పస్రా గ్రామంలో 6వ వార్డులో,డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో కనీస వసతులైన అండర్ డ్రైనేజీ లేకపోవడంతో మురికి నీరు రోడ్ల మీదికి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.గత 8 సంవత్సరాల నుండి డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనిలో నివసిస్తున్న ప్రజలకు విద్యుత్ స్తంబాలు లేకపోవడంతో వీధి లైట్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్న ఒకటే స్తంబానికి వైర్లు క్రిందికి వెలాడాడంతో ప్రమాదకరంకంగా ఉన్నాయి. సీసీ రోడ్డు లేదు, కాలనీ మొత్తానికి విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేసి విద్యుత్ ను అందించాలి. అదేవిధంగా భారీ వర్షాలు వచ్చినప్పడు కాలనీ మొత్తం ఖాళీ చేయాల్సివస్తుందని శాశ్వతంగా వర్షాల నీళ్లు రాకుండా పరిష్కారం చేయాలని అన్నారు.

అదేవిదంగా కాలనీ లో ఇండ్ల మధ్యలోనే పిచ్చి చెట్లు పెరిగి పాములు వస్తున్నాయాని ఇప్పటికే కొంతమంది పాము కాటుకు గురై ఆసుపత్రుల పాలైనారని అన్నారు.కనీసమైనా త్రాగు నీరు లేక, వీధి లైట్ల లేకపోవడం సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సీతక్క స్వంత నియోజకవర్గంలోని పస్రా గ్రామ సమస్యలను తక్షణమే నిధులు కేటాయించి పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో  డివైఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు గోందు రాజేష్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పిట్టల అరుణ్,జక్కు వేణు, మాదాసు శ్రవణ్, పల్లపు రాజు,చిరంజీవి, దామోదర్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad