– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన మురికి రాజు మానవత దృక్పథంతో స్పందించి రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేల ప్రకారం ప్రతి సంవత్సరం రక్తదానం చేసే వారికి గుండెచప్పుడు క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని తెలియజేయడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, మానవతదృక్పథంతో స్పందించి రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. రక్తదానం పైన ఉన్న అపోహలను విడనాడాలని ఈ సందర్భంగా యువకులకు సూచించారు.
రక్తదానం చేసే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES