- Advertisement -
డాక్టర్ జూటోత్ రాంచంద్రనాయక్, ప్రభుత్వ విప్
నవతెలంగాణ దినపత్రిక… ప్రజల పత్రిక అని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జూటోత్ రాంచంద్రనాయక్ అన్నారు. పత్రిక పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘నవతెలంగాణ’ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ… ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా తన విధులను బాధ్యతగా నిర్వహిస్తోందని కొనియాడారు. భవిష్యత్‌లో ప్రజా సమస్యలకు గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు.
- Advertisement -