నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో కోతుల సమస్య గ్రామీణ జీవితాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మండల వ్యాప్తంగా వందల కోతులు ప్రజల ఇళ్లు, పొలాలను తివ్ర నష్టం చేస్తున్నాయి. మహిళలు, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. కటాక్షపూర్, హౌజుబుజుర్గు గ్రామాల్లో కోతుల బెడద తివ్రంగా ఉంది. హౌజుబుజుర్గు గ్రామంలోని 1, 7 ,8 వాడల్లో కోతులు “శనివారం ఇండ్లలో జోరబడి నిత్యావసర వస్తువుల ఎత్తుకెల్లాయని మహిళలు తెలిపారు. గ్రామ పరిసరాల్లో ఉన్న పొలంలో మొక్కజొన్న పంటను కోతులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ పంట మా ఏడాది ఆధారం. కానీ వానర దాడితో పంటలు పాడై నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోతున్నారు. శనివారం “హౌజుబుజుర్గు గ్రామ 7 వాడలో మహిళలపై కోతులు దాడి యత్నం చెశాయి. ఇంట్లోకి జోరబడి బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు ఎత్తుకెళ్తున్నాయి. అండుపడిన వారిపై దాడి చేస్తున్నాయి. కోతుల బెడద తో గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. మహిళలు ఒంటరిగా ఇంటి పనులు చేయలేకపోతున్నారు. “అధికారులు వచ్చి కోతులను తొలగించకపోతే మా జీవితం ఇలాగే ఉంటుంది” అని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మండల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోతుల అరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, రైతులకు తగిన న్యాయం చేయాల కోరుతున్నారు.



