- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రజాకవి కాళోజీ నారాయణరావు గొప్ప మహానీయుడని మండల తహశీల్దార్ ఎండి మూజిక్ అన్నారు. ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ జయంతి కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -