Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాకవి కాళోజీని స్ఫూర్తిగా తీసుకోవాలి: తహశీల్దార్

ప్రజాకవి కాళోజీని స్ఫూర్తిగా తీసుకోవాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు కృషిచేసిన ప్రజాకవి కాలోజీ నారాయణరావును పూర్తిగా తీసుకోవాలని రాటారం మండలం తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో అడ్డురి బాబు లు పిలుపునిచ్చారు. మంగళవారం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహించడం ద్వారా కాళోజి సాహిత్య సేవలను స్మరించుకోవడం గర్వకారణమని, కాళోజి కవిత్వంలో మన భాష, మన భూమి, మన సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -