Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహిస్తే గౌరవం లభిస్తుంది: జిల్లా ఎస్పీ  

క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహిస్తే గౌరవం లభిస్తుంది: జిల్లా ఎస్పీ  

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి :  పోలీసు శాఖలో క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న  సిహెచ్. శ్రీధర్,  ఏ. శ్రీనివాస్ రెడ్డిలు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా వారి భుజాలపై పదోన్నతి పట్టీలు అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతులు పోలీసు శాఖలో బాధ్యతను మరింత పెంచుతాయని అన్నారు. పదోన్నతి పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని, ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -