– బరిలో 78 మంది అభ్యర్థులు
అధికార పార్టీలో అసంతృప్తుల బెడద
10 వ వార్డులో 7(ఏడుగురు) పోటీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాల్టీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అధికార – ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తుల మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 22 వార్డులకు గాను 146 నామినేషన్లు దాఖలుకాగా, పరిశీలనలో రెండు నామినేషన్లు అనర్హత పొందాయి. అర్హత పొందిన 108 నామినేషన్లలో 30 నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి 78 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
పార్టీల వారీగా చూస్తే
బీఆర్ఎస్ – 22
కాంగ్రెస్ – 21
బీజేపీ – 15
అలయన్స్ డెమోక్రటిక్ రిజిస్టర్డ్ పార్టీలు – 13
స్వతంత్రులు – 4
సీపీఐ – 1
సీపీఐ(ఎం) – 1
జనసేన – 1
మొత్తం 22 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో 78 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది అసంతృప్తులు నామినేషన్లు దాఖలు చేయగా, పార్టీ నాయకుల బుజ్జగింపుల అనంతరం 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.పలువురు స్వతంత్రంగా బరిలో కొనసాగుతున్నారు.
వార్డు వారీగా పోటీ పరిస్థితి
5, 6, 9, 12, 14, 20 వార్డులు – ద్విముఖ పోటీ (6 వార్డులు)
8, 15, 16, 17 వార్డులు – త్రిముఖ పోటీ (4 వార్డులు)
1, 2, 3, 4, 7, 11, 13, 18, 22 వార్డులు – చతుర్ముఖ పోటీ (9 వార్డులు)
21వ వార్డు – పంచముఖ పోటీ (5 మంది)
19వ వార్డు – 6 మంది పోటీ
10వ వార్డు – అత్యధికంగా 7 మంది అభ్యర్థులతో బహుముఖ పోటీ.



