సర్పంచులకు అండగా ఉంటా.. పెర్క శ్రీనివాస్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ ఉమ్మడి మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ జన్మదిన వేడుకలను నసురుల్లాబాద్ మండల సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ 55వ జన్మదిన వేడుకలను నసురుల్లాబాద్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్యామ్ నాయక్, పలు గ్రామ సర్పంచ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ వచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. అలాగే సర్పంచులు పెర్క శ్రీనివాస్ పూలదండ, బొకే, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్యామ్ నాయక్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాసేవలో ముందుండే పెర్క శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ రాజకీయంగా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాము, సర్పంచులు పెర్మల్, హాజీపూర్, సాయగౌడ్, కంశేట్ పల్లి, తరుణ్ నాయక్, సంగెం ఏ, తాటికోల్ సాయిలు బొమ్మన్ దేవ్ పల్లి, నాయకులు బలరాం సింగ్, మోహన్, శంకర్, వినోద్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ సింగ్ రాథోడ్, మాజీ జిల్లా. కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మజీద్, దేవి సింగ్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



