Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్ నుంచి శాశ్వత పునరావాసం కల్పించాలి

డేంజర్ జోన్ నుంచి శాశ్వత పునరావాసం కల్పించాలి

- Advertisement -

– కలెక్టర్ నిర్వాసితుల వినతి
నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపికి 500 మీటర్ల దూరంలో డేంజర్ జోన్‌గా అధికారికంగా గుర్తించబడినప్పటికీ, ఇప్పటివరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ నిర్వాసితులు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రాన్నీ సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడారు డేంజర్ జోన్లో నివసిస్తున్న ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా, శాశ్వత పునరావాసం కల్పించకుండా జెన్కో అధికారులు తాత్కాలిక లీజుల మాటలు చెప్పడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా గ్రామం డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు విరుద్ధమని వారు తెలిపారు.

ఇళ్లను ఖచ్చితంగా గుర్తించేందుకు అవసరమైన సర్వే ప్రక్రియ మండల తహసీల్దార్ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల ఆలస్యం అవుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.సిబ్బంది కొరత కారణంగా అర్హులైన కుటుంబాల గుర్తింపు, పునరావాసం, నష్టపరిహార ప్రక్రియలు ముందుకు సాగడం లేదని తెలిపారు. డేంజర్ జోన్‌లో నివసించడం ప్రజల ప్రాణాలకు సంబంధించిన అత్యవసర అంశం కావడంతో, డేంజర్ జోన్ నుంచి ప్రతి కుటుంబానికి శాశ్వత పునరావాసం ఎలాంటి షరతులు లేకుండా పూర్తి నష్టపరిహారం ఇవ్వాలన్నారు.డేంజర్ జోన్ ఇళ్ల సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కేసారపు రవి, కేసారపు సురేందర్, కోట మహేష్, తాండ్ర ఆశీర్వాదం, ఇందారపు రాజపోచయ్య, కొలుగూరి సంపత్, తాండ్ర సామెల్ మాటూరి అన్వేష్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -