జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారు
ఆదిలాబాద్ అభివృద్ధికి ఇది ముందడుగు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి కోసం 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 73ని విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)నివేదిక సానుకూలంగా రావడంతో భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ అభివృద్ధికి ఎయిర్‌పోర్టు కీలక ముందడుగు కాబోతుందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమతుల్య ప్రాంతీయ వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ త్వరలోనే దేశ విమానయాన పటంలో కీలక స్థానం దక్కించుకోబోతుందన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 700 ఎకరాల భూసేకరణకు అనుమతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

