జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో డిఐపిసి, టీజి ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీ ఐ పాస్ కి సంబంధించిన వివిధ శాఖలను కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులందరూ నిర్ణీత కడుపులోగా ఆమోద నిబంధనలను చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ దరఖాస్తులు మరియు పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు ( కోల్,ఆల్కహాల్) సిఫారసు చేయడానికి ఆమోదించనైనది. సమావేశ ప్రారంభంలో టీఎస్ ఐపాస్, టి ఐ డి ఈ ఏ స్కీం ల గురించి వివరించి, నేటి అజెండా గురించి ప్రస్తావించి ఆమోదమునకు కమిటీ నివేదించనైనది. ప్రవేశపెట్టిన అన్ని అజెండా అంశాలను కమిటీ ఆమోదించనైనది.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ పి సి బి వెంకన్న,జిల్లా మైన్స్ అధికారి రవి కుమార్, ఫ్యాక్టరీస్ అధికారి జంగయ్య, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ,ఇతర అధికారులు పాల్గొన్నారు.



