మియాపూర్‌లో అక్రమ కట్టడంపై హైడ్రా కొరడా
ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఐదు అంతస్తుల
భవనం కూల్చివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో కోట్లాది రూపాయల విలువచేసే ఐదంతస్తుల అపార్ట్ మెంట్‌ను శనివారం హైడ్రా కూల్చివేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా వెళ్తోన్న హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. హైడ్రా పరిశీలనలో సదరు భవనం, నిర్మాణ స్థలం అక్రమమని తేలింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పని పూర్తి చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నెంబర్ 337, 338 పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాచేశారు. అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 337, 338లలో హుడా అప్రూవ్డ్ లేఅవుట్‌లో (400 గజాలలో 126 నెంబర్) ప్లాట్ కొనుగోలు చేసిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఆ పక్కనే మియాపూర్‌లోని సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి ప్లాట్లు సృష్టించారు. హెచ్‌ఎండీఏ భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మించారు. తప్పడు ఎల్‌ఆర్‌ఎస్‌ను సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు డీడీలను సైతం ఫేక్‌వి తయారు చేశారు. ఇప్పటికే వారిపై అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూమిలోకి చొరబడి చేపట్టిన నిర్మాణం కావడంతో స్థానిక రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది.
అక్కడ అనుమతులు… ఇక్కడ నిర్మాణాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



