Thursday, May 15, 2025
Homeఖమ్మంఅధ్యయనం, అవగాహనతోనే వ్యక్తిత్వ వికాసం: ఏడీ

అధ్యయనం, అవగాహనతోనే వ్యక్తిత్వ వికాసం: ఏడీ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: విద్యా విషయాల అధ్యయనం, పరిసరాల అవగాహనతోనే ఎవరి వ్యక్తిత్వం అయినా వికసిస్తుంది అని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ అన్నారు. కళాశాలలో ఎస్సి ఎస్టీ విభాగం బాధ్యులు కోటేశ్వర్ రావు సమన్వయంతో విద్యార్ధులు కోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాసం శిక్షణ సంస్థ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. కళాశాల ఆద్వర్యంలో విద్యార్థుల కోసం  నిర్వహిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులకు సూచించారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ అద్యక్షులు జవ్వాది వెంకటేశ్వర బాబు ప్రధాన శిక్షకులుగా పలు అంశాలపై విద్యార్ధులకు వికాసం కల్పించారు. ఈ శిబిరంలో ఏజీ  బీఎస్సీ  మొదటి, రెండవ సంవత్సర విద్యార్ధినీ విద్యార్థినులు మొత్తం 250కి పైగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగ పడే ఎన్నో అంశాలను చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -