- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
ఈనెల 17 న జిల్లాస్తాయి అస్మిత ఖేలో ఇండియ అథ్లెటిక్ విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం బాలికలు ప్రతిభ చాటి, పథకాలు సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. అండర్ 26 విభాగంలోనీ షాట్ ఫూట్ లో ఉష మొదటి స్థానం సాధించింది. అండర్ 14 ట్రాయాత్లాన్ A విభాగంలో పోటీపడిన తేజస్విని, తృతీయ స్థానం సాధించింది, అదే విభాగం ట్రాయాత్లాన్ B లో పోటీపడి అవంతిక కూడా తృతీయ స్థానం సాధించింది. బాలికలను క్రీడల్లో ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ను ప్రారంభించింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలో పాఠశాల విద్యార్థులు పథకాలు సాధించారు.
- Advertisement -



