నవతెలంగాణ-హైదరాబాద్: ఓవైపు ఇండియాపై అదనపు సుంకాలతో యూఎస్ ప్రెసిడెంట్ దాడి చేస్తుండగా..మరో వైపు ఆదేశ ప్రభుత్వాధికారులు మాటలతో భారత్ పై విరుచుపడుతున్నారు. తాజాగా మరోసారి ట్రంప్ సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌పై విమర్శల దాడి చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌పై విమర్శల దాడి చేశారు. ఈ సారి ఆయన ఎలాన్ మస్క్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ను సైతం టార్గెట్ చేశారు. ఎక్స్ ఫ్యాక్ట్‌చెక్ ‘తప్పుదారి పట్టించేదని మండిపడ్డారు. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తూ భారత్ లాభాలను ఆర్జిస్తోందని.. ఆయిల్ కొనుగోలుతో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ యంత్రాన్ని నడిపిస్తుందని పీటర్ నవారో ఆరోపించారు. ‘భారత్ అధిక సుంకాలు అమెరికన్ ఉద్యోగాలను చంపుతోందని.. భారత్ లాభం కోసమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తుంది. ఈ ఆదాయం రష్యాకు యుద్ధంలో బలాన్ని ఇస్తుంది. ఉక్రేనియన్లు, రష్యన్లు చనిపోతున్నారు.
తర్వాత ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్‌పై సైతం నవారో విమర్శలు గుప్పించారు. ‘వావ్! ఎలోన్ మస్క్ ప్రజల పోస్ట్‌లలోకి ప్రచారాన్ని అనుమతిస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్ అర్థం లేనిదని.. భారతదేశం లాభాపేక్ష కోసం మాత్రమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని.. యుద్ధానికి ముందు భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేదన్నారు. ఉక్రేనియన్లను చంపడం ఆపండి.. అమెరికన్ ఉద్యోగాలను తొలగించడం ఆపండి అంటూ స్పందించారు. ఇదిలా ఉండగా.. భారత్‌పై అమెరికా ఇప్పటి వరకు 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దాంతో భారత్ ఎగుమతులపై 50శాతం కంటే ఎక్కువగా సుంకాలు ఉన్నాయి. బ్రెజిల్ కంటే అత్యధికం.