Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సంస్థల ఎన్నికలపై.. సుప్రీంలో పిటిషన్‌

స్థానిక సంస్థల ఎన్నికలపై.. సుప్రీంలో పిటిషన్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 6న పిటిషన్‌పై విచారణ జరపనుంది. స్థానిక ఎన్నికలకు ఇటీవల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -