Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై డీఈవోకు వినతి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై డీఈవోకు వినతి

- Advertisement -

– మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 
నవతెలంగాణ – కామారెడ్డి

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం డీఈవో వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల  యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సోఫియా, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి లు మాట్లాడుతూ బకాయి బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని, కోడిగుడ్లను, వంట గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, యూనిఫారం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  సంగీత, హేమలత ,రాజేశ్వరి , సాయిలు, సువర్ణ, హుస్సేన్ బి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img