Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కారోబార్లకు వేతనాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం 

కారోబార్లకు వేతనాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కారోబార్లుకు గతకొన్ని నెలలుగా సాంకేతిక కారణాలవల్ల వేతనాలు ఆగిపోవడంతో మండల కారోబార్ల సమైక్య ప్రతినిధులు కరోబార్లకు సాంకేతిక కారణాలు పరిష్కరించి వేతనాలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగామండలకారోబార్ల సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ వేతనాలు నిలిచిపోవడం వలన కుటుంబ పోషణకుఇబ్బందులు ఎదురవుతున్నట్లు కారోబర్లు తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించి వేతనాలను మళ్లీ వారి ఖాతాలలో జమ చేయాలంటూ ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సమస్యపై సానుకూలంగా స్పందించారు. గతంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలని అసెంబ్లీలో మాట్లాడానని ఆయన గుర్తు చేస్తూ ఈవిషయం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యనుపరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదేల్లి  మాజీ సర్పంచ్ కాగుల మోహన్ యాదవ్, పండరి, శ్రావణ్, మనసారామ్, సాయిలు, అనిల్, శ్రీనివాస్, శంకర్ వివిధ గ్రామ కారోబర్లు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad