- Advertisement -
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్లకట్టలు దొరికిన ఘటనకు సంబంధించి ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. జస్టిస్ వర్మపై అంతర్గత విచారణ నివేదికతోపాటు తగిన చర్య కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఈ నెల 8న సమాచారం పంపిన విషయాన్ని జస్టిస్ ఎఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌కు గుర్తుచేసింది. నగదు దొరికిన తరువాత జస్టిస్ వర్మపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని, క్రిమినల్ చట్టం అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపార పిటిషన్ దాఖలు చేశారు.
- Advertisement -