Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టైలర్స్ కాలనీ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కు వినతి 

టైలర్స్ కాలనీ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కు వినతి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
టైలర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. ప్రజలు లేని చోట రోడ్లు మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నాయని, ప్రజలు ఉన్నచోట మురికి కాలువలు సీసీ రోడ్ లో నిర్మాణం జరగకపోవడం వల్ల మురికి నీళ్లు నిలువ ఉండడం వల్ల ఈగలో దోమలతో విష జ్వరాలు వచ్చి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇండ్లలోకి పాములు, తేలు, విషపురుగులు రావడం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలు ఉన్నచోట ముందుగా మురికి కాలువలు సీసీ రోడ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లతా, జ్యోతి, భూలక్ష్మి, రుకుంబాయ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -