టీబ్ల్యూజేఎఫ్ కార్యక్రమం సక్సెస్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీబ్ల్యూజేఎఫ్) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టర్లకు వినతిపత్రాల కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 33 జిల్లాలకు 28 చోట్ల జర్నలిస్టులు, ఫెడరేషన్ శ్రేణులు కలెక్టర్లతో సమస్యలపై చర్చించారు. ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్లు, మహిళలకు రాత్రిపూట రవాణా సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించాలని ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా వేజ్‌బోర్డు సిఫారసులు అమలుకావడం లేదని తెలియజేసింది. కనీస వేతనాల జీవోను సమీక్షించి కొత్త జీవో తేవాలని కోరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇండ్లస్థలాల సమస్య చర్చనీయాంశంగా ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసింది. వీటి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌తో మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా , నియోజకవర్గ, మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్థస్థలాలు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే హెల్త్‌కార్డులు మంజూరుచేయాలని సూచించింది. ఈ మేరకు ఫెడరేషన్ మహాసభల కన్వీనర్ పి.రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


