Friday, July 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడారంలో ప్రారంభానికి సిద్ధమైన పెట్రోల్ బంక్

మేడారంలో ప్రారంభానికి సిద్ధమైన పెట్రోల్ బంక్

- Advertisement -

మేడారం భక్తులకు తీరనున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు
ఆదివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభం
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రాంతం లో ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో ఊరట్టం స్థూపం దగ్గర వచ్చే ఆదివారం పెట్రోల్ బంక్ పంచాయతీ రాజ్ మంత్రి ధనుసరి సీతక్క చేతులు మీదుగా ప్రారంభానికి సిద్దమైంది. మేడారం ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఓపెన్ అయితే చుట్టూ ప్రక్కల ఉన్న సుమారుగా 20 గ్రామాలలో ఉన్న ప్రజలకు, రైతులకు, మేడారం నిత్యం దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

పెట్రోల్ బంక్ ఏర్పాటు శుభపరిమాణం: చెర్ప రవీందర్, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చెర్ప రవీందర్

మేడారం ప్రాంతం లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలి అని 2022 సంవత్సరం నుండి కలెక్టర్, పిన్సిపల్ సెక్రటరీకి వివిధ అధికారులకు విన్నవించుకుంటున్నాం. ప్రజా ప్రభుత్వం రాగానే, ఇక్కడ డిమాండ్ కు అనుగుణంగా మంత్రి  సీతక్క చొరవతో  పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం శుభపరిమాణం. స్థానికులకు భక్తులకు ఎమ్మార్పి ధరకు నాణ్యమైన పెట్రోల్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -