Saturday, February 7, 2026
E-PAPER
Homeబీజినెస్పీఎఫ్‌సీ చేతికి ఆర్‌ఈసీ

పీఎఫ్‌సీ చేతికి ఆర్‌ఈసీ

- Advertisement -

– మెగా విలీనంతో కేంద్రానికి భారీగా నిధులు
న్యూఢిల్లీ :
దేశీయ విద్యుత్‌ రంగ ఫైనాన్సింగ్‌ రంగంలో భారీ విలీనం చోటు చేసుకుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)లో ప్రభుత్వానికి ఉన్న 52.63 శాతం వాటాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎఫ్‌సీ) కొనుగోలు చేసింది. దీనితో ఆర్‌ఈసీ ఇప్పుడు పీఎఫ్‌సీకి అనుబంధ సంస్థగా మారింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ కొనుగోలుకు ఆమోదం తెలపడమే కాకుండా, భవిష్యత్తులో ఈ రెండు సంస్థల పూర్తిస్థాయి విలీనానికి కూడా సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. రెండు సంస్థల విలీనం ద్వారా రుణ పంపిణీ సామర్థ్యం పెరిగి, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఇవి బ్యాటరీ స్టోరేజ్‌, మెట్రో రైలు వంటి భారీ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం మరింత సులభతరం కానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో కేంద్రానికి భారీ ఆదాయం సమకూరనుంది. ఇది ఒక రకంగా పెట్టుబడుల ఉపసంహరణే కావడం గమనార్హం. మరోవైపు దీనిపై ఇరు సంస్థల ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనం ద్వారా విద్యుత్‌ ఫైనాన్స్‌ రంగంలో పోటితత్వం లోపించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగాలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -