– అధ్యక్షుడిగా గౌతమ్ జైన్ నియామకం
నవ తెలంగాణ – హైదరాబాద్
దేశంలోని ప్రముఖ వాణిజ్యవేత్తల సంఘం పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (పీహెచ్‌డీసీసీఐ) తెలంగాణ శాఖను ఏర్పాటు చేసింది. దీనికి తొలి అధ్యక్షుడిగా పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ నియమితులయ్యారు. స్టోన్ ఇండిస్టీ, ఫ్యాషన్ రంగంలో ఆయనకు 50 ఏండ్ల అనుభవం ఉంది. ఈ సందర్బంగా శుక్రవారం హైదరాబాద్‌లో ”భారత్-్‌యకే ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్” అంశంపై ఓ ఇంటరాక్టివ్ సెషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎఫ్‌టీఏ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారీగా పెంచుతుందని యూకే డిప్యూటీ హై కమిషనర్ (ఏపీ, టీజీ) గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌డీసీసీఐ జాతీయ అధ్యక్షుడు హేమంత్ జైన్, డీజీఎఫ్‌టీ సంయుక్త డైరెక్టర్ అజరు ఎస్‌సీ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌డీసీసీఐ తెలంగాణ శాఖ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -