Tuesday, November 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'ఫీనిక్స్‌'.. మా అబ్బాయికి మంచి ఆరంభం

‘ఫీనిక్స్‌’.. మా అబ్బాయికి మంచి ఆరంభం

- Advertisement -

హీరో విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఫీనిక్స్‌’. స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్‌మ్యాన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై రాజలక్ష్మి ‘అన్ల్‌’ అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో ఈనెల 7న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భం మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ,’ఈ వేడుకకు వచ్చిన దర్శకుడు గోపీచంద్‌కి థ్యాంక్స్‌. నేను ‘జవాన్‌’ సినిమా చేస్తున్నప్పుడు అనల్‌ అరసు మాస్టర్‌ని కలిసాను. అప్పుడు ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటించాలని అన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత సినిమా చేశారు. నేను సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను.

తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్‌ సినిమా చేయాలని ఉండేది. తనకి యాక్షన్‌ చాలా ఇష్టం. నన్ను యాక్షన్‌ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. అలాంటి సినిమాలు చేయడం తన కల. ఒక రోజు తను యాక్టర్‌ కావాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్‌ అనల్‌ అరసు మాస్టర్‌, నిర్మాత రాజ్యలక్ష్మి వలన సాధ్యపడింది. ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్‌ రాసిన భాష్యశ్రీకి థ్యాంక్స్‌. వరలక్ష్మి, నేను చాలా మంచి ఫ్రెండ్స్‌ . తనకి చాలా హై ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్‌ ఎమోషన్‌ అన్ని చాలా అద్భుతంగా కుదిరాయి. తప్పకుండా ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు. ‘విజయ్ సేతుపతి అంటే నాకు చాలా ఇష్టం. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మా జయమ్మ. తనతో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. రీసెంట్‌గా నేను ‘జాట్‌’ సినిమా చేశాను. అనల్‌ అరసు మాస్టర్‌ సూపర్‌ యాక్షన్‌ చేశారు. యాక్షన్‌ కొరియోగ్రఫీని ఒక కథ లాగా చెప్పారు.

‘ఫీనిక్స్‌’ ట్రైలర్‌ చాలా బాగా అనిపించింది. ఈ సినిమా తమిళంలో రిలీజ్‌ అయ్యి చాలా పెద్ద హిట్‌ అయింది. సినిమా బాగుందంటే ఏ భాష అయినా సరే వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. విజయ్ ని అలానే గుండెల్లో పెట్టుకున్నారు. సూర్యకి కూడా అలాగే వెల్‌కమ్‌ చెప్తూ, తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని చెప్పారు. ‘విజయ్ సేతుపతి వాళ్ళ అబ్బాయి సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. తమిళ్లో చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా అలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను’ అని వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చెప్పారు. డైరెక్టర్‌ అనల్‌ అరసు మాట్లాడుతూ,’ఆల్రెడీ తమిళ్‌లో రిలీజ్‌ అయ్యి, చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా అంత పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. సూర్యకి చాలా టాలెంట్‌ ఉంది’ అని అన్నారు. ‘విజయ్, వరలక్ష్మి, గోపీచంద్‌కి థ్యాంక్స్‌. ఈనెల 7న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది. అందరూ ఈ సినిమాని సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నాకు ఈ ఛాన్స్‌ ఇచ్చిన మా నిర్మాతకి కృతజ్ఞతలు. తమిళంలో మంచి ఆదరణ పొందింది. తెలుగులో కూడా బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది. ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మీకు నచ్చుతుంది. – హీరో సూర్య సేతుపతి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -