భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఓ మైలురాయిగా నిలిచిన ఫోన్‌పే ఆవిష్కరణకు దశాబ్దం పూర్తయింది, ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఫోన్‌పే ఇటీవల దశాబ్ది వేడుకలను నిర్వహించింది. దశాబ్దం పాటు పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి, లక్షలాది మందికి ఆర్థిక సేవలను చేరువ చేయడానికి, భారతదేశంలో డబ్బుతో లావాదేవీలు చేసే, డబ్బును నిర్వహించే విధానంలో మార్పును తీసుకురావడానికి సూచికగా ఈ మైలురాయి నిలుస్తుంది.
2025లో, ఫోన్‌పేలో రిజిస్టర్ అయిన యూజర్ల సంఖ్య 60 కోట్లు దాటడంతో ఫోన్‌పే ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది, ఇది భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలవడంలో ఫోన్‌పే పాత్రను మరింత పటిష్టం చేసింది. ఈ సంవత్సరం, విశ్వసనీయమైన కాంటాక్ట్‌లకు డెలిగేటెడ్ పేమెంట్లు (పేమెంట్ చేసే అనుమతిని సెకండరీ యూజర్‌కు ప్రైమరీ యూజర్ ఇవ్వడం) చేసే అవకాశాన్ని కల్పించే UPI సర్కిల్‌తో పాటు, మోసపూరిత లావాదేవీల నుండి లక్షలాది మందికి భద్రత కల్పించడానికి రూపొందించిన సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ అయిన ఫోన్‌పే ప్రొటెక్ట్ వంటి ఫీచర్లను తీసుకురావడం ద్వారా యూజర్ నమ్మకాన్ని పెంచడం, యాక్సెస్ చేయగలిగే సర్వీస్‌లను విస్తరించడంపై దృష్టి సారించింది.
మర్చంట్ ఎకోసిస్టమ్‌ను మరింత శక్తిమంతం చేయడం కోసం, మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్‌స్పీకర్, స్మార్ట్‌పాడ్‌లను ఫోన్‌పే ప్రవేశపెట్టింది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్‌ల చేరికను ప్రోత్సహించింది. SIDBIతో ఫోన్‌పే కుదుర్చుకున్న భాగస్వామ్యంలో భాగంగా తీసుకొచ్చిన ఉద్యమ్ అసిస్ట్ అనే కార్యక్రమంతో, వారి అధికారిక క్రెడిట్ యాక్సెస్‌ను క్రమబద్ధీకరిస్తూ, MSMEలకు డిజిటల్-ఫస్ట్ ఇంటిగ్రేషన్‌ను మొదటగా అందించిన సంస్థలలో ఒక కంపెనీగా నిలిచింది. వీటికి తోడు, భారతదేశంలో ఆర్థిక భద్రత లేని ప్రజల (మిస్సింగ్ మిడిల్) కోసం హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అందరికీ కావాల్సిన సంరక్షణను, సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి, వినియోగదారులకు అందించే ప్రోడక్ట్‌లను ఫోన్‌పే విస్తరించింది, అదే సమయంలో మ్యూచువల్ ఫండ్‌లపై లోన్ వంటి వినూత్న లెండింగ్ సొల్యూషన్ల ద్వారా లిక్విడిటీని అన్‌లాక్ చేసింది, కీలకమైన ఆర్థిక సర్వీస్‌లు కోట్లాది మందికి అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది.
ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, “మా పదేళ్ల ప్రయాణంలో అత్యంత ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే, మేము ఇంత దూరం వచ్చినా కూడా, శిఖరాగ్రం ఇంకా మాకు కనిపించడం లేదు. అది ఎంత ఎత్తులో ఉందో, ఎంత విస్తరించి ఉందో కూడా మాకు తెలియదు, కాకపోతే అలా తెలియకపోవడం వల్లనే ఈ ప్రయాణం ఉత్సాహభరితంగా మారుతోంది. తమ రంగంలో అత్యుత్తమంగా రాణించడానికి ప్రతిరోజూ కృషి చేస్తున్న వేలాది మంది ఉత్సాహవంతులైన, పట్టుదల కలిగిన వ్యక్తులతో సాగిస్తున్న ఈ ప్రయాణం ఎప్పటిలాగే అర్థవంతంగా, ఉత్తేజకరంగా కొనసాగుతుంది” అని అన్నారు.
ఫోన్‌పే వ్యవస్థాపకుడు, CTO రాహుల్ చారి మాట్లాడుతూ, “ఫోన్‌పేలో మేము సాగించిన నిర్మాణం గురించి చాలా గర్వంగా ఉంది. పరిశ్రమతో పాటు, విస్తారమైన ఎకోసిస్టమ్ నుండి లభించిన ఆదరవు, మద్దతు మాలో అణకువను నింపాయి. ఈ ప్రయాణం నుండి నేర్చుకోవాల్సిన శాశ్వతమైన పాఠం ఏదైనా ఉందంటే, అది ప్రజలు వాస్తవంగా నమ్మే దాన్ని నిర్మించడమే, ఎందుకంటే తీవ్రమైన ఉత్సాహం మాత్రమే ఒక ఆలోచనను ప్రభావం చూపే శక్తిగా మలచగలదు” అని అన్నారు.
ఫోన్‌పే ఈ రంగంలోకి అడుగు పెట్టినప్పటి నుండి, ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యీకరించే లక్ష్యంతో, పరిశ్రమలో మొట్టమొదటిసారిగా వచ్చిన వరుస ఆవిష్కరణలను తీసుకొచ్చి, భారతీయ ఫిన్‌టెక్ ల్యాండ్‌స్కేప్‌ను స్థిరంగా పునర్నిర్వచించింది. డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్‌ల నుండి మొదలుకుని, ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకింగ్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం వరకు, పలు మార్పులకు లోనవుతూ, పేమెంట్స్ యాప్ నుండి ఆర్థిక సేవలన్నీ సమగ్రంగా అందించే ఎకోసిస్టమ్‌గా (కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌గా) రూపాంతరం చెందింది. మర్చంట్లకు అందుతున్న పేమెంట్లపై వారికి స్పష్టతను ఇవ్వడానికి, అలానే నియంత్రణను కల్పించడానికి ఫోన్‌పే బిజినెస్ యాప్, చిన్న వ్యాపారాలను శక్తిమంతం చేయడానికి మర్చంట్ లెండింగ్, క్రెడిట్‌ను సజావుగా యాక్సెస్ చేయడానికి UPIలో క్రెడిట్ లైన్, తగాదాలు, విభేదాలు లేని లావాదేవీల కోసం ప్రవేశపెట్టిన క్రాస్-బోర్డర్ UPI, UPI లైట్, అలానే 2024లో ప్రారంభించిన ఇండస్ యాప్‌స్టోర్, షేర్.మార్కెట్, సెక్యూర్డ్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు వంటి ముఖ్యమైన మైలురాళ్లు ఈ మొత్తం ప్రయాణంలో ఉన్నాయి. 2022లో కార్యకలాపాల నిర్వహణను పూర్తిగా భారతదేశానికి మార్చేయడం, అలానే క్రెడిట్, సంపద నిర్వహణలోకి నిరంతరం విస్తరించడం ద్వారా, ఫోన్‌పే ఒక సాధారణ యుటిలిటీ అనే అభిప్రాయాన్ని దాటుకుంటూ, భారతదేశ ఆర్థిక నిర్మాణంలో అంతర్భాగంగా మారే స్థాయికి ఎదిగింది, సంరక్షణ, ఇన్వెస్ట్‌మెంట్, క్రెడిట్ సౌకర్యాలు అనేవి దేశంలోని ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండాల్సిన హక్కులు అని భావిస్తూ, అవి అందరికీ అందేలా చూసుకుంటోంది.



