నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లుక్క గంగాధర్ ను మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు మంగళవారం మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు వంగరి రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ స్థాయి సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్, తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లుక్క గంగాధర్ ను మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులను అలంకరించి పేరు పైఖ్యాతలు పొందాలని ఈ సందర్భంగా సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండలం ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంగరి రవీందర్, ఉపాధ్యకులు ప్రవీణ్, కార్యదర్శి పసుపుల లింగమూర్తి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సంపత్, గడ్డం పవన్, తదితరులు పాల్గొన్నారు.



