బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత సమ సమాజ దార్శనికుడు, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఫూలే జయంతి సందర్భంగా జాతికి చేసిన సేవలను శనివారం ఒక ప్రకటనలో స్మరించుకున్నారు. సబ్బండ వర్ణాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్యద్వారా మాత్రమే సాధ్యమౌతుందని చెప్పిన జ్యోతిరావు ఫూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని కేసీఆర్ తెలిపారు. సబ్బండ వర్ణాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమౌతుందన్న ఫూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. బీసీ కులాల ప్రగతి కోసం పదేండ్లలో విప్లవాత్మక పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. బీసీ కులాల విద్యకోసం ప్రత్యేక గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యనందించామని వివరించారు. దళిత, బహుజన వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఫూలేకు నిజమైన నివాళి అని తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఫూలే ఆశయాలకు అనుగుణంగా గత ప్రభుత్వంలో అమల్లోకి తెచ్చిన ప్రగతి కార్యాచరణను చిత్తశుద్ధితో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
భావితరాలకు ఫూలే గొప్పతనాన్ని చాటిచెప్పాలి : కేటీఆర్
మహిళా సాధికారత, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫూలే జయంతి సందర్భంగా ఆయనకు శనివారం ఎక్స్ ద్వారా ఘన నివాళులు అర్పించారు. సమాజంలో విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ఫూలే చేసిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. భావితరాలకు ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఫూలే ఆశయ సాధనలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను భారీగా ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినట్టు వివరించారు. బీసీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనే లక్ష్యంతో ఫూలే పేరు మీద విదేశీ విద్యా స్కాలర్షిప్‌లను కూడా అందజేసి గౌరవించిందని వెల్లడించారు.
సమసమాజ దార్శనికుడు ఫూలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



