Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన పూలే

సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన పూలే

- Advertisement -

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు
శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాడైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన 119 వ జయంతి ఉత్సవాలను శనివారం శ్రీరామగిరి గ్రామంలో నిర్వహించడ ఎంతో సంతోషంగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా  మాదరి ప్రశాంత్  మాట్లాడుతూ పూలే సేవలను స్మరించుకొని  మహాత్మ పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సమాజంలో సమానత్వం, విద్యా అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుగులోతు బాలాజీ, ఉపసర్పంచ్ రామగిరి సుమన్ వార్డు మెంబర్స్ గొల్లపెల్లి వేణు, అరపెల్లి వినోద్, పంజాల పుష్ప యాకన్నా, రామగిరి ప్రభాకర్ బీమలత, వివో ఏ గంగిశెట్టి శ్రీనివాస్  బెల్లి నర్సయ్య, చీమకుర్తి యాకన్నా,ఆవుల వెంకన్న, మద్దెల సమ్మయ్య, బుర్ర సోమిరెడ్డి, కర్ణాకర్, తదితరులు నోముల సంతోష్, శ్రీను,రాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -