నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరులో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ చైర్మన్ విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో శనివారం పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అయిత రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జంపయ్య, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ హాజరై పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో కొయ్యుర్లో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాహత్మ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. యువత ఆయన ఆలోచనలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పావురాల ఓదెలు, మెట్టు రామన్న, మమత, రజిత, శ్రీనివాస్ రెడ్డి, చారి, నరేశ్, కొండయ్య పాల్గొన్నారు.



