నవతెలంగాణ – తుంగతుర్తి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చిరస్మరణీయమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు పేదలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యతోనే సాధ్యమని,స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి,సమాజంలోని అసమానతలను తొలగించి,కుల వ్యవస్థ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని,వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి,మహిళా విద్య,సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ,వారి ఆశయాలను కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్,స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అన్నెపర్తి జ్ఞాన్సుందర్,మాజీ డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు,సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్,పట్టణ అధ్యక్షుడు రాంబాబు,మాచర్ల అనిల్ క్యాస్ట్రో, కొండరాజు, చిలుకల వెంకన్న,దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.



