నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిమ్స్ ఫిజియోథెరపీ వైద్యుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు మరియు ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు ఫిజియోథెరపీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ వైద్యులు రమేష్ మాట్లాడుతూ .. మామూలుగా అందరూ లాప్టాప్ లు వారి మోకాళ్లపై పెట్టుకుని వాడకం చేస్తారు. అలా చేయడం వలన సలహాలు, సూచనలు మైగ్రేన్, పిల్లలకు అలవాటు చేయకూడదు.
పుట్టిన పిల్లలల్లు ఫిజియోథెరపీ చేస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు చిన్న చిట్కాలను పాటించి ఇంట్లోనే చిన్న తరహా నొప్పులను తగ్గించుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి,ఎంపిఓ రాజేష్, తాసిల్దార్ శాంత,ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



