- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్డీఎఫ్ కూటమికి మద్దతు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అమలు చేయడంలో విఫలమయ్యారని, రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన వంటి హామీలను గాలికొదిలేశారని ఆమె ఆరోపించారు. కేరళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పినరయి విజయన్ నాయకత్వమే ప్రగతికి మార్గమని కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
- Advertisement -



