ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..
నవతెలంగాణ – ముషీరాబాద్ : మూడు రంగుల జెండాతో దేశాన్ని ఏకం చేసిన ఘనత పింగళి వెంకయ్యకు దక్కుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 62 వ వర్ధంతి కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా రాంనగర్ ఈ సేవ చౌరస్తా, జనప్రియ అపార్ట్మెంట్ వద్ద అన్నదానం జరిగింది. పింగళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంబించారు.
ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ.. వెంకయ్య జీవితం అందరికీ స్పూర్తి అని చెప్పారు. మువ్వన్నెల జెండాను రూపొందించి కులమతాలకు అతీతంగా ప్రజలను సంఘటితం చేసిన పింగళికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య స్మారక సమితి ట్రస్ట్ చైర్మన్ జగదాంబ, అధ్యక్షులు శ్యామల్ రావు, ప్రధాన కార్యదర్శి బంగారు ప్రశాంత్, లక్ష్మణరావు, సలహాదారు అడ్వకేట్ శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయి, పీసీసీ కార్యదర్శి జి.ఎన్.కేశవ్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె హెచ్ ఎస్ జగదాంబ, చైర్ పర్సన్ కోడూరి శ్యామలరావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి మాధవ్, నేత శ్రీనివాస్, శేష సాయి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశాన్ని ఏకం చేసిన పింగళి వెంకయ్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES