వేలాది ఎకరాల్లోని నీటిలో పూల సంద్రం
కేరళలో టూరిస్టులను ఆకర్షిస్తున్న మలరిక్కల్ గ్రామం
ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకుల తాకిడి
ఐదు నెలల్లోనే రూ.5 కోట్లు సంపాదన
తిరువనంతపురం : అందమైన ప్రకృతి అందాలతో టూరిస్టులను ఆకర్షిస్తూ పర్యాటకానికి పేరుగాంచిన కేరళలో ఓ గ్రామానికి అదృష్టం వరించింది. అక్కడ వందలాది ఎకరాల్లోని నీటిలో విస్తరించి ఉన్న పింక్ వాటర్ లిల్లీస్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆ గ్రామానికి టూరిస్టుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడి అక్కడ పెరిగిన టూరిజం కారణంగా ఆ గ్రామానికి ఆదాయం కూడా తెచ్చిపెడుతున్నది. గత ఐదు నెలల్లోనే దాదాపు రూ.5 కోట్ల వరకు పర్యాటకం ద్వారా రాబట్టగలిగింది. ఆ గ్రామమే.. కొట్టాయం జిల్లాలోని మలరిక్కల్. ఈ గ్రామంలో వర్షాకాలంలో వరి పొలాలు కాస్తా పింక్ వాటర్ లిల్లీస్‌తో నిండిపోతాయి. దీంతో చూడటానికి అది ఒక గులాబీ సముద్రంలా కనిపిస్తుంది. ఈ అందమైన దృశ్యాన్ని ఆస్వాదించటానికి రోజుకు రెండు వేల మంది నుంచి మూడు వేల మంది పర్యాలకులు వస్తుంటారు. వారాంతంలోనైతే అది పదివేల మందికి పైగా ఉంటుంది.
వర్షాకాలంలో ఇక్కడి వందలాది ఎకరాలు నీటితో నిండిపోయి.. పింక్ వాటర్ లిల్లీస్‌తో అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఏర్పరుస్తాయి. పింక్ లిల్లీస్‌తో నిండి ఉన్న నీటిలో బోటింగ్ చేస్తూ, ఆ సుందరమైన ప్రకృతి రమణీయ దృశ్యాన్ని ఆస్వాదించాలని పర్యాటకులు ఇక్కడకు వేలాది సంఖ్యలో వస్తున్నారు. ఇలా పడవ ప్రయాణాలు, పార్కింగ్ ఫీజులు,హౌటళ్లు, టీ షాపులు, పూల అమ్మకాలు, ‘సేవ్ ద డేట్’ పేరుతో ఫోటో షఉట్లతో ఆ గ్రామానికి రూ. కోట్లలో ఆదాయం వచ్చి చేరింది. పైన చెప్పిన మార్గాల ద్వారా గ్రామ పంచాయతీకి ఐదు నెలల్లో రూ.5 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా పూల కొమ్మలను ఒక్క బంచ్ రూ.30కి అమ్మి ఆదాయం పొందుతున్నారు. జులై నుంచి అక్టోబర్ వరకు నీరు నిలిచిన పొలాల్లో ఈ తామర పూలు సహజంగా మొలుస్తాయి. ఇవి ఇప్పుడు అక్కడి స్థానిక రైతులకు వరంగా మారాయి. వర్షాకాలం ముగిశాక త్వరలోనే ఈ తామర పూలను తీసివేసి తిరిగి వరి సాగును ప్రారంభిస్తారు.
ఆదాయ వనరుగా పింక్ వాటర్ లిల్లీస్
- Advertisement -
- Advertisement -