దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి : సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీం రద్దు చేయాలని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. శుక్రవారం నిర్వహించిన బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సదస్సుకు హైదరాబాద్ కార్యదర్శి సుశీల్ కుమార్ అధ్యక్షత వహించగా, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ ప్రసంగించారు.జె.వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌లను ముందుకు తెచ్చి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని కోరారు. 2025-26 బడ్జెట్‌లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసి సామాజిక సంక్షేమానికి కోతలు విధించిందని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 3జి, 4జి అనుమతిలివ్వకుండా బలహీనపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేఎశారు. రైల్వే, రోడ్, ఎయిర్ వేస్ తదితర మౌలిక రంగాల్లో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో లక్షల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతున్న నేపథ్యంలో ఈ సమ్మెకు అత్యంత ప్రాధాన్యత ఉందని వివరించారు. 10 రోజులు ప్రచారం చేపట్టి సమ్మెను విజయవంతం చేయాలని సూచించారు. సుశీల్ కుమార్ మాట్లాడుతూ మైన్స్ డెవలపింగ్, ఆపరేటింగ్ పేరుతో ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్‌ను, అంతరిక్ష పరిశోధనలో కూడా ప్రయివేటుకు భాగస్వామ్యం కల్పిస్తూ దేశ భద్రతకు ప్రమాదం తెస్తున్నారని తెలిపారు. 2023 విద్యుత్ సవరణ చట్టం అమలైతే కరెంటు చార్జీల భారం ప్రజలు మోయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు. ఈ సదస్సులో యూనియన్ నాయకులు పి.పద్మావతి, నర్సింగరావు, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీం రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES