నవతెలంగాణ – హైదరాబాద్: భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్ కు రిటైర్మైంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన వీడ్కోలు విషయాన్ని ప్రకటిస్తూ పోస్ట్ చేశాడు. తనకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. 36ఏళ్ల పీయూష్ చావ్లా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అతడు భారత్ తరఫున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు 446 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 319 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడు దేశవాళీల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో పలు టీమ్‌ల తరఫున ఆడాడు. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
క్రికెట్ కు పీయూష్ చావ్లా రిటైర్మైంట్
- Advertisement -
- Advertisement -