Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టండి : హైకోర్టు

జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టండి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెంటనే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్స్‌, రూల్స్‌, జీవోలు, సర్క్యులర్లన్నింటినీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సూరేపల్లి నందా మంగళవారం విచారించారు. 2022లో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జీవోలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి ప్రజల కు అందుబాటులో ఉండేలా చేయాల న్నారు. ‘2023 డిసెంబరు నుంచి 2025 జనవరి దాకా 19,064 జీవోలు జారీ చేస్తే అందులో 3,290 జీవోలే జనానికి అందుబాటులో ఉన్నాయి. 15,774 జీవోలు అందుబాటులో లేవు. జీవోలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 2017లో జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయాలని 2022లో డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం జీవోలను అప్‌లోడ్‌ చేయకుండా గుట్టుగా ఉంచింది’ అని పిటిషనర్‌ వాదన. దీనిపై విచారించిన న్యాయమూర్తి జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -